![]() |
![]() |
.webp)
గ్రాండ్ విటారా కారుని కొనాలనుకుంటున్న బుల్లితెర నటి శ్రీవాణి. హైదరాబాద్ ట్రాఫిక్‌కి ఆటోమేటిక్ కార్ ఐతే బాగుటుందని ఆ కార్ కొంటున్నట్లు చెప్పింది.. ఈ కారులో ఉన్న కొత్త కొత్త ఆప్షన్స్‌ని తన ఫాన్స్ కోసం చూపించింది. ప్రతీ ఫీచర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయించింది. అలాగే ఇందులో మరో ఫెసిలిటీ కూడా ఉందని యాభై వేల వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయని చెప్పింది.
ఇక ఈ వాయిస్ కమాండ్ టెస్టింగ్ కోసం శ్రీవాణి భర్త విక్రమ్ "సుజుకి భోజనం చేశావమ్మా" అని కామెడీ చేసేసరికి అందరూ నవ్వేశారు. ఈ కార్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే ఒక నెల రోజులు క్లాసులకు వెళ్ళాలి అని అంది శ్రీవాణి. కార్ గురించి తెలుసుకున్న విక్రమ్ "ఇది కారా మనిషా" అనేసరికి ఈ కార్‌ని మరోసారి టెస్ట్ డ్రైవ్ చేసి కొనాలని డిసైడ్ చేసింది శ్రీవాణి. కార్ కొన్నాక దాని మీద కూడా ఒక వ్లాగ్ చేస్తానని చెప్పింది.
బుల్లితెర నటి శ్రీవాణి, ఆమె భర్త విక్రమాదిత్య ఈ మధ్య కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఈమె తన యూట్యూబ్ ద్వారా రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ అందరినీ అలరిస్తుంటుంది.
![]() |
![]() |